నెట్‌ స్లోగా ఉందా? ఈ లైట్‌ యాప్స్‌ ట్రై చేయండి!

నెట్‌ స్లోగా ఉందా? ఈ లైట్‌ యాప్స్‌ ట్రై చేయండి!


భారత్‌లాంటి దేశాల్లో ఇంటర్నెట్‌ వేగం తక్కువగా ఉండటం.. నెట్‌ వస్తూపోతూ ఉండటం.. స్పీడ్‌లో హెచ్చుతగ్గులుండటం సర్వసాధారణమే! దీని కారణంగా ఒక్కోసారి బెస్ట్‌ యాప్స్‌ కూడా యూజర్స్‌కు సరైన అనుభూతిని ఇవ్వడంలో విఫలమవుతుండటం తెలిసిందే. ఇలాంటి సమస్య పరిష్కారానికి అందుబాటులోకి వచ్చినవే... లైట్‌ యాప్స్‌(lite apps)!! ఇవి ఎక్కువ డేటాను తీసుకోవు, ఫోన్‌లో ఎక్కువ స్పేస్‌ను వినియోగించుకోవు. అంతేకాకుండా ఇవి పనిచేయడానికి ఎక్కువ రిసోర్సెస్‌ కూడా అవసరం లేదు. అవేంటో చూద్దాం...



ఫేస్‌బుక్‌ లైట్‌

ఈ యాప్‌ను 2జీ నెట్‌వర్క్‌పై వాడేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. ముఖ్యంగా ఇంటర్నెట్‌ స్పీడ్‌ నిలకడ లేకుండా, స్లోగా ఉన్నప్పుడు  ఉపయోగపడేలా ఫేస్‌బుక్‌లైట్‌ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ చాలా తక్కువ స్పేస్‌ తీసుకుంటుంది. త్వరగా లోడ్‌ అవుతుంది. ఏ ఫోన్‌లో అయినా పనిచేస్తుంది. సాధారణ యాప్‌లో ఉండే అన్ని ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. రియాక్షన్స్, జియోఫిల్టర్స్, కెమెరా ఎఫెక్ట్స్‌ అన్నింటినీ ఫేస్‌బుక్‌ అందుబాటులో ఉంచింది.



స్కైప్‌ లైట్‌

మైక్రోసాఫ్ట్‌ కూడా స్కైప్‌యాప్‌కు లైట్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. వాస్తవానికి ఈ స్కైప్‌ లైట్‌ యాప్‌ను భారత్‌లోనే లాంచ్‌ చేయడం విశేషం. ఇది కేవలం 13ఎంబీ ఉంటుంది. 2జీ నెట్‌వర్క్‌పై బెస్ట్‌గా పనిచేసేలా దీన్ని రూపొందించారు. ముఖ్యంగా నెట్‌ కనెక్టివిటీ నిలకడగా లేని ప్రాంతాల కోసం స్కైప్‌లైట్‌ను తయారు చేశారు.



యూట్యూబ్‌ గో

ఈ యాప్‌ ద్వారా  వీడియోలను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒక వీడియోకు ఎంత డేటా అవసరమో కూడా ఈ యాప్‌ తెలియజేస్తుంది. అంతేకాకుండా యూట్యూబ్‌ గో యాప్‌ సాయంతో అసలు వీడియో ప్లే చేయడానికి ముందే ప్రివ్యూ చూసుకునే వీలుంటుంది.



ట్విటర్‌ లైట్‌

ఈ యాప్‌ గత నెలలోనే లాంచ్‌ అయింది. ఇది అధికారిక ట్విటర్‌ యాప్‌నకు కుదింపు వెర్షన్‌. దీన్ని ప్రగతిశీల వెబ్‌యాప్‌ (పీడబ్ల్యూఏ)అని పేర్కొనవచ్చు. ఇది ఫోన్‌లో 1ఎంబీ కంటే తక్కువ స్పేస్‌ను తీసుకుంటుంది. దీనివల్ల  డేటా సేవ్‌ అవుతుంది. ఈ యాప్‌ను 3జీ కనెక్షన్‌తో చాలా తక్కువ వ్యవధిలోనే లాంచ్‌ చేయవచ్చని, 70 శాతం డేటా ఆదా అవుతుందని ట్విటర్‌ పేర్కొంది.



ఇన్‌స్టాగ్రామ్‌ లైట్‌

ఇది ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌కు మొబైల్‌ వెబ్‌సైట్‌.  ఫో¯Œ లో మెమరి తక్కువగా ఉందనుకుంటే... ఇన్‌స్టాగ్రామ్‌ వెబ్‌సైట్‌లో మీ ఫోన్‌ వెబ్‌ బ్రౌజర్‌తో అన్ని సర్వీసెస్‌ పొందొచ్చు. అయితే వెబ్‌పేజీ నుంచి ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను ఉపయోగించడం కుదరదు.



కెమెరా 360 లైట్‌

మీకు బ్యూటీ ఫిల్టర్స్, సెల్ఫీస్‌ తీసుకోవడం చాలా చాలా ఇష్టం. కానీ ఫోన్‌ స్లోగా ఉంది. ఏం చేస్తారు. వెంటనే కెమెరా 360 లైట్‌ యాప్‌ను ఆన్‌ చేయండి. ఈ యాప్‌ 4ఎంబీ కంటే తక్కువ స్పేస్‌ను తీసుకుంటుంది. క్షణాల్లో ఫొటో కోసం సిద్ధమవుతుంది.



ఒపెరా మినీ

క్రోమ్‌ ఎంత ర్యామ్‌ తీసుకుంటుందో అందరికీ తెలిసిందే కదా! కానీ ఫోన్‌లో నెట్‌ స్లోగా ఉంది.. అలాంటప్పుడే ఒపెరా మినీ యాప్‌ అవసరమవు తుంది. క్రోమ్‌.. వందల మెగాబైట్లు తీసుకుంటుంటే, ఒపెరా మినీకి 43ఎంబీ సరిపోతుంది. మీ డేటా ప్లాన్‌ను సేవ్‌ చేస్తుంది. ఈజీగా డౌన్‌లోడ్స్‌ అయ్యేలా సహకరిస్తుంది.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top