కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్ 1

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్ 1 - Sakshi


సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్ 1లో పాలిటీ నుంచి  ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో విశ్లేషణ ఇవ్వండి?

 - బి.సుధారాణి, రాజేంద్రనగర్

 

 2011, 2012 సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-1తో పోలిస్తే ఈసారి పాలిటీ విభాగం నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వచ్చాయి. ఈ సబ్జెక్టు నుంచి 19 ప్రశ్నలు అడిగారు. మొత్తం మీద ఈ విభాగంలో ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని చెప్పొచ్చు.

 Ex: Which of the following bodies does not/ do not find mention in the Constitution?

 1. National Development Council

 2. Planning Commission

 3. Zonal Councils

 Select the correct answer using the codes given below.

 a) 1 and 2 only    b) 2 only

 c) 1 and 3 only    d) 1, 2 and 3

 జవాబు: d

 

 - పాలిటీ విభాగంలో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి.  

 Ex: Consider the following statements:

 Attorney General of India can

 1. take part in the proceedings of the Lok Sabha

 2. be a member of a committee of the Lok Sabha

 3. speak in the Lok Sabha

 4. vote in the Lok Sabha

 Which of the statements given above is/are correct?

 a) 1 only    b) 2 and 4

 c) 1, 2, 3    d) 1 and 3 only

 జవాబు: d

 

 -    నిర్భయ చట్టం, అవినీతి కుంభకోణాలు తదితర సమకాలీన అంశాలపై ప్రశ్నలు రాకపోవడం నిరాశపరిచే అంశం.

 -    పాలిటీ అంటే అందరి దృష్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌పైనే ఉంటుంది. వాటిపై తప్పకుండా ప్రశ్నలు వస్తాయని అభ్యర్థులు భావిస్తారు. అయితే 2013లో ఆర్టికల్స్‌పై ప్రశ్నలు రాలేదు.

 

 ఇన్‌పుట్స్: డా॥బి.జె.బి. కృపాదానం(పాలిటీ),

 సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

 

 ఐబీపీఎస్ బ్యాంక్స్ పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? రిఫరెన్స్ బుక్స్‌ను సూచించండి?

         - దివ్య, దిల్‌సుఖ్‌నగర్

 

 ఐబీపీఎస్ బ్యాంక్ పీవోస్, క్లరికల్, ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిల్లో అడిగే ప్రశ్నల్లో ఎక్కువ శాతం బ్యాంకింగ్, ఎకానమీ సంబంధిత రంగాల నుంచి అడుగుతున్నారు. ఉదాహరణకు రెపోరేటు, రివర్స్ రెపోరేట్ అంటే ఏమిటి? ఎస్‌ఎల్‌ఆర్‌ను విస్తరించండి? ఎస్‌ఎల్‌ఆర్‌ను రిజర్వ్ బ్యాంక్ ఎంత శాతానికి మార్చింది? వంటి ప్రశ్నలు ఇస్తున్నారు. స్టాక్ జీకే నుంచి కేవలం నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు.

 

 ఇందులో ముఖ్యంగా వివిధ దేశాలు - కరెన్సీలు, ఆయా దేశాల పార్లమెంటుల పేర్లు, ముఖ్యమైన దినోత్సవాలు వంటివాటిపై ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు గత ఆరు నెలల కరెంట్ అఫైర్స్‌ను, స్టాక్ జీకేకు అన్వయించి చదువుకోవాలి. ఉదాహరణకు జీ-8 సదస్సు ఎక్కడ జరిగింది? అనే ప్రశ్న కరెంట్ అఫైర్స్‌కు చెందింది. జీ-8లో సభ్య దేశం కానిది? అనే ప్రశ్న స్టాక్ జీకేకి సంబంధించింది. అదేవిధంగా మరో ప్రశ్న ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నవారు ఎవరు? ఈ ప్రశ్న కరెంట్‌అఫైర్స్‌కు చెందింది కాగా.. ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరిస్తారు? అనే ప్రశ్న స్టాక్ జీకేకు చెందింది.

 

 కాబట్టి అభ్యర్థులు పరీక్ష నాటికి గత ఆరు నెలల కరెంట్ అఫైర్స్‌ను చదువుకోవాలి. వార్తల్లో వ్యక్తులపై కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. రిపబ్లిక్ దినోత్సవానికి వచ్చిన విదేశీ అతిథి ఎవరు? అనే ప్రశ్నను దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ ఇస్తున్నారు. వీటితోపాటు కొన్ని సాధారణమైన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఉదాహరణ: నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? నేపనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? వంటి ప్రశ్నలు. కాబట్టి అభ్యర్థులు అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీపై పెద్దగా ప్రశ్నలు రావు. అయితే ఇస్రో ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి? ఇస్రో చైర్మన్ ఎవరు? వంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలుగానే భావించాలి. అంతేకానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు అని అనుకోరాదు.

 

 రిఫరెన్స్ కోసం

 -    ప్రామాణిక దినపత్రికలు

 -    బ్యాంకింగ్ సర్వీసెస్ క్రానికల్

 -    ప్రతియోగితా దర్పణ్

 -    తాజా కరెంట్ అఫైర్స్ కోసం వెబ్‌సైట్: www.sakshieducation.com  

 - ఇన్‌పుట్స్:  ఎన్.విజయేందర్‌రెడ్డి,

 సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top