అమెరికన్‌ డిగ్రీ మీ కలా?

America's top online bachelor's and graduate programs - Sakshi

వాషింగ్టన్‌ : ఆన్‌లైన్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్సామ్స్‌ను అందిస్తున్న టాప్‌ అమెరికన్‌ యూనివర్సిటీల వివరాలను అమెరికన్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. కొలంబస్‌లోని ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌ ర్యాకింగ్స్‌లో తొలిస్థానంలో నిలిచింది. ఆన్‌లైన్‌ ప్రోగ్సామ్‌లో నెంబర్‌ వన్‌గా నిలవడం ఒహియో స్టేట్‌ యూనివర్సిటీకి ఇదే తొలిసారి.

ఆన్‌లైన్‌ ఎంబీఏ కోర్సును ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీల్లో టెంపుల్‌ యూనివర్సిటీ వరుసగా నాలుగోసారి తొలిస్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్‌ కోర్సును ఆఫర్‌ చేస్తున్న వాటిలో కొలంబియా యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉంది. దాదాపు 1500లకు పైగా ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌ను అనలైజ్‌ చేసిన అనంతరం యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్టు ఈ ర్యాంకులను ప్రకటించింది.

కంప్యూటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వరుసగా ఆరోసారి టాప్‌ ర్యాంకును సాధించింది. దక్షిణ కరోలినాలోని క్లెమన్సన్‌ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్‌లో టాప్‌లో నిలువగా.. చికాగోలోని సెయింట్‌ జేవియర్‌ నర్సింగ్‌లో తొలిస్థానంలో ఉంది.

ఏయే ప్రోగ్సామ్స్‌లో ఏయే యూనివర్సిటీలు ఉన్నత స్థానాల్లో ఉన్నాయో కింద చూడొచ్చు.
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌
1. ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ - కొలంబస్‌
2. ఎంబ్రీ రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీ
3. టెంపుల్‌ యూనివర్సిటీ

ఎంబీఏ
1. టెంపుల్‌ యూనివర్సిటీ
2. కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీ
3. ఇండియానా యూనివర్సిటీ

బిజినెస్‌(నాన్‌-ఎంబీఏ)
1. విల్లనోవా యూనివర్సిటీ
2. అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ
3. ఇండియానా యూనివర్సిటీ

కంప్యూటర్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ
1. యూనివర్సిటీ ఆఫ్‌ సౌథర్న్‌ కాలిఫోర్నియా
2. న్యూయార్క్‌ యూనివర్సిటీ
3. వర్జీనియా టెక్నాలజికల్‌ యూనివర్సిటీ

ఎడ్యుకేషన్‌
1. క్లెమన్సన్‌ యూనివర్సిటీ
2. క్రెగ్‌టన్‌ యూనివర్సిటీ
3. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లారిడా

ఇంజనీరింగ్
1. కొలంబియా యూనివర్సిటీ
2. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
3. యూనివర్సిటీ ఆఫ్ సౌథర్న్‌ కాలిఫోర్నియా

నర్సింగ్‌
1. సెయింట్‌ జేవియర్‌ యూనివర్సిటీ
2. ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ
3. మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్ సౌత్‌ కాలిఫోర్నియా

క్రిమినల్‌ జస్టిస్‌
1. శామ్‌ హౌస్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ
2. బోస్టన్‌ యూనివర్సిటీ
3. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా
4. యూనివర్సిటీ ఆప్‌ నెబ్రాస్కా

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top