అలనాటి నటి కనకం కన్నుమూత

అలనాటి నటి కనకం కన్నుమూత - Sakshi


విజయవాడ: అలనాటి ప్రముఖ నటి టి.కనకం (88) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం కన్నుమూశారు. ఖర్గపూరులో జన్మించిన కనకం చిన్పపుడు ఆకాశవాణి బాలల కార్యక్రమంలో తన గొంతు వినిపించింది. ఆ తర్వాత 'నాయకురాలు' అనే నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసి తనలోని నటనను నిరూపించుకుంది.అనంతరం సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , శోభన్ బాబు, కృష్ఱ వంటి గొప్ప నటులతో నటించింది. 'కీలుగుర్రం', పాతాళభైరవి, గృహప్రవేశం, షావుకారు, రక్షరేఖ, గుణసందరి కథ, భక్త ప్రహ్లాద, లేత మనసులు వంటి సినిమాలలో ఆమె నటించారు. సినీ రంగంలో సేవలందిన వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ ఆర్ట్ అవార్డ్ ను 2004  సంవత్సరానికి గాను కనకం అందుకున్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top