రైతుల సంక్షేమానికి డీసీసీబీ కృషి


చిట్యాల (నకిరేకల్‌) : రైతుల సంక్షేమానికి డీసీసీబీ కృషి చేస్తుందని డీసీసీబీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు అన్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని సింగిల్‌ విండో కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన స్థానిక సంఘం చైర్మన్‌ అంతటి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘం సభ్యుడు బోడిగె లింగయ్య ఇటీవల మృతిచెందగా సంఘం ద్వారా మంజూరైన రూ.పది వేల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ మధన్‌మోహన్‌రావు, వైస్‌ చైర్మన్‌ పకీరు పద్మారెడ్డి, డైరెక్టర్లు వెంకట్‌రెడ్డి, బాలరాజు, సీఈఓ ఎల్లారెడ్డి, రైతులు భిక్షం, వెంకటేశం పాల్గొన్నారు.

Back to Top