వెంకయ్యను ఆదరించిన ఉదయగిరి ప్రజలు

వెంకయ్యను ఆదరించిన ఉదయగిరి ప్రజలు


ఉదయగిరి వాసులతో విడదీయరాని అనుబంధం



ఉదయగిరి: సామాన్య నిరుపేద రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి న ముప్పవరపు వెం కయ్యనాయుడును అక్కున చేర్చుకుని రాజకీయంగా ఆదరించిన ఘన చరిత్ర ఉదయగిరి నియోజ కవర్గ వాసులది. వి ద్యార్థి నాయకుడిగా నెల్లూరు వీఆర్‌ కళాశాలలో ఉద్యమాలు చేస్తూ 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఉదయగిరి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ధనేంకుల నరసింహం వెంకయ్యనాయుడుకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన విజయం సాధించా రు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌  తరపున మాదాల జానకిరాం, రెడ్డి కాంగ్రెస్‌ తరపున కూండ్ల చెంచురామయ్య పోటీచేసినప్పటికీ సునాయాసంగా 19,700 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం సృష్టించగా ఉదయగిరిలో మాత్రం ఆ పార్టీ తరపున పోటీచేసిన గణపం బాలక్రిష్ణారెడ్డిపై 24,311 ఓట్ల మెజారిటీతో బీజేపీ తరపున పోటీచేసిన వెంకయ్యనాయుడు ఘనవిజయం సాధించారు.



ఉదయగిరి ఎమ్మెల్యేగా వెంకయ్య కృషి

ఉదయగిరి శాసనసభ్యునిగా పనిచేసిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేశారు. నియోజకవర్గంలో చెట్లకింద సాగుతున్న చదువులను పక్కా భవనాల్లోకి మార్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రూరల్‌ ఎలక్ట్రిక్‌ స్కీం కింద ఆనాడు నియోజకవర్గంలోని 104 గ్రామ పంచాయతీలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించటమే కాకుండా ఉదయగిరిలో 33/11కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుచేశారు. దీంతో నియోజకవర్గంలో విద్యుత్‌పరంగా ఎంతో మేలు చేకూరింది. పరిపాలనా సౌలభ్యం కోసం మేజర్‌ పంచాయతీలను చిన్న పంచాయతీలుగా విడగొట్టారు. ఆనాటి కలెక్టర్‌ సుజాతరావు సహాయసహకారాలతో నియోజకవర్గంలో ఎన్నో పక్కాగృహాలు నిర్మించారు. రెండుసార్లు కేంద్రమంత్రిగావున్న వెంకయ్య ఉదయగిరి నియోజకవర్గానికి కొంతమేర మేలు చేకూర్చారు. 1999లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామసడక్‌ యోజన ద్వారా తారురోడ్లు ఏర్పాటుచేశారు. ప్రస్తుత మంత్రిగా కామధేను ప్రాజెక్టు నియోజకవర్గానికి సాధించారు. రూ.550 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటుకు కృషిచేస్తున్నారు.



అసెంబ్లీ టైగర్‌గా గుర్తింపు

1983 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన వెంకయ్య విజయం కోసం ఆనాటి అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వాజ్‌పేయి ఉదయగిరి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి గణపం బాలక్రిష్ణారెడ్డి తరపున ఎన్టీఆర్‌ ప్రచారం చేశారు. అయినా వెంకయ్య విజయానికి నియోజకవర్గ ప్రజలు మొగ్గుచూపారు. అప్పుడు అసెంబ్లీలో వెంకయ్యనాయుడు వాగ్ధాటి, చతురత ఎంతో అద్భుతంగా ఉండేది. దీంతో ఆయనకు అసెంబ్లీ టైగర్‌ పేరుతో ఉదయగిరి ప్రజలు పిలుచుకునే వారు.



యువతతోనూ మమేకం

 ఆయన ఉదయగిరి నియోజకవర్గాన్ని వదిలివెళ్లి 30 ఏళ్లు పైబడినా ఈ ప్రాంత యువతతో అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆయనతో కలిసి పనిచేసిన ఈ ప్రాంతవాసుల పిల్లలు ఎక్కువగా ఆయన్ను కలుస్తుంటారు. వారు కలిసినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తుల క్షేమసమాచారాలు వాకబు చేస్తుండేవారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top