వరంగల్‌కు చేరుకున్న వంశీ మృతదేహం


వరంగల్‌: అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన వంశీరెడ్డి మృతదేహం శుక్రవారం వరంగల్‌కు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన వంశీరెడ్డి(27).. ఓ యువతిని కాపాడే యత్నంలో దుండగుడి కాల్పులకు గురై ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.మృత దేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి మంత్రి కేటీఆర్‌.. విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. వంశీ మృతదేహాం రాకతో.. వరంగల్‌ అర్భన్‌ జిల్లా వంగపహడ్‌లో విషాదచాయలు అలముకుననాయి. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Back to Top