ఉత్సాహంగా జర్నలిస్టుల క్రీడాపోటీలు

ఉత్సాహంగా జర్నలిస్టుల క్రీడాపోటీలు

భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడాపోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. రెండోరోజు షటిల్‌పోటీలు జేఎన్‌టీయూకే ఇండోర్‌ స్టేడియంలో, క్రికెట్‌ పోటీలు రంగరాయ మెడికల్‌ కళాశాల ఆవరణలో, కబడ్డీ జేఎన్‌టీయూ క్రీడా మైదానంలో జరిగాయి. రెండో రోజు క్రీడల్లో 13 జిల్లాల నుంచి వచ్చిన 300కిపైగా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని వివిధ క్రీడల్లో చాటారు. ప్రొఫెషనల్‌ ప్లేయర్స్‌లా మైదానంలో మెరిశారు. క్రికెట్లో తూర్పుగోదావరి జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై ఓటమి పాలైంది. శ్రీకాకుళం- నెల్లూరు జట్ల మధ్య సాగిన క్రికెట్‌ పోటీలో శ్రీకాకుళం విజయం సాధించింది. పశ్చిమ గోదావరి-అనంతపురం జట్లమధ్య సాగిన పోరులో అనంతపురం అత్యధిక పరుగుల తేడాతో గెలిచింది. కబడ్డీలో శ్రీకాకుళం జట్టుపై తూర్పుగోదావరి అత్యుత్తమ ప్రతిభతో ఘన విజయాన్ని సాధించింది. పశ్చిమగోదావరి-కృష్ణాజట్ల మధ్య కబడ్డీ పోరులో కష్ణాజట్టు విజయాన్ని అందుకుంది. కబడ్డీ క్రీడాకారులను జిల్లా కబడ్డీజట్టు గౌరవా«ధ్యక్షుడు ఎంపీ తోటనరసింహాం ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సాహపరిచారు. 
Back to Top