సింగపూర్‌ను మించి అభివృద్ధి

సింగపూర్‌ను మించి అభివృద్ధి - Sakshi


నెల్లూరు ‘జన్మభూమి-మా ఊరు’లో సీఎం చంద్రబాబు వెల్లడి

 

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఉదయగిరి/కలిగిరి: ‘సింగపూర్ మొత్తం విస్తీర్ణం 750 కిలోమీటర్లు. ఉన్న కొంతలోనే ఎంతో అభివృద్ధి చెందింది. నెల్లూరు విషయానికొస్తే 13 వేల చదరపు కి.మీ. విస్తీర్ణం.. 170 కి.మీ. తీర ప్రాంతముంది. సింగపూర్‌ను తలదన్నేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నెల్లూరు-తిరుపతి-చెన్నై మధ్య ప్రాంతాలను ట్రై ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో, కలిగిరి మండలం పెద్దపాడులో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్ బహిరంగ సభలో ప్రసంగించారు.



అంతకుముందు నెల్లూరు జిల్లాలో రూ.60 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయనున్న ‘మెగా టూరిజం సర్క్యూట్, జూబ్లీ ఆసుపత్రిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ శిక్షణ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ నెల్లూరు మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.



 రూ.25 కోట్లతో కూచిపూడి కళను విస్తరించనున్నట్లు సీఎం తెలిపారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయని, అందుకోసం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కష్టపడుతున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సీఎం పెద్దపాడు ‘జన్మభూమి-మాఊరు’ గ్రామసభలో కూడా మాట్లాడుతూ పలు హామీలిచ్చారు.



 తొలిరోజు జన్మభూమిపై సీఎం సమీక్ష

 సాక్షి, విజయవాడ బ్యూరో: తొలిరోజు జన్మభూమి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఆదివారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా కలెక్టర్లతో మాట్లాడి గ్రామసభలు జరిగిన తెలుసుకుని పలు సూచనలు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top