రహదారుల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి

నీవా న ది వద్ద నూతన వంతెన రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి సిద్దారాఘవరావు. - Sakshi

 

– నీవా న ది వద్ద నూతన వంతెన ప్రారరంభించిన మంత్రి సిద్ధారాఘవరావు 

చిత్తూరు(ఎడ్యుకేషన్‌): రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రోడ్లు అభివృద్ధి  చెందాలని రాష్ట్ర రవాణా, ర హదారులు భవనాల శాఖామంత్రి సిద్ధారాఘవరావు అన్నారు. శనివారం చిత్తూరులో కట్టమంచి వద్ద నీవా నది వద్ద జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన వంతెనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  జిల్లాలో జాతీయ రహదారి అభివృద్ధి  పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో గ్రామాలకు సైతం పూర్తి స్థాయిలో రోడ్డు వేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోస్టల్‌ కారిడర్‌ పథకం ద్వారా 990 కిమీ రోడ్లను వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యక్రమాలు జరగకుండా తిరుపతిలో జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయన్నారు. అటువంటి విమర్శలు రాకుండా ఏ కార్యక్రమమైనా చిత్తూరులోనే జరిగేలా చూడాలని చెప్పారు. ఎంపీ శివప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాకు జాతీయ రహదారుల అభివృద్ధికి కలెక్టర్‌ ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు వెళ్లాలన్నారు.  కలెక్టర్‌ చొరవ లేనిదే ఏ పథకంఅభివృద్ధి ఉండదని చెప్పారు. చిత్తూరు–తిరుపతి మార్గంలో రైల్వే గేట్ల వల్ల ప్రయాణికులను నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఇకపై అలాంటి సమస్యలు లేకుండా ఆ రైల్వే క్రాసింగల వద్ద వంతెనలు నిర్మించడానికి నిధుల విడుదలయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంఎల్‌ఏ సత్యప్రభ, ఎంఎల్‌సీ గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి, కలెక్టర్‌ సిద్దార్థజైన్, శాప్‌ చైర్మన్‌ పీఆర్‌ మోహన్, ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజనీర్‌ గోపాలకృష్ణ, చిత్తూరు ఇన్‌చార్జి మేయర్‌ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top