టీ - 20 విజేత ఎంపీఈడీ


ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలలోని విభాగాల మధ్య నిర్వహిస్తున్న టీ-20 కప్‌ను ఎంపీఈడీ జట్టు కైవసం చేసుకుంది. వర్సిటీ స్టేడియంలో శుక్రవారం సైన్స్‌ క్యాంపస్‌ కళాశాల, ఎంపీఈడీ జట్ల మధ్య ఫైనల్‌మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సైన్స్‌ క్యాంపస్‌ కళాశాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంపీఈడీ జట్టు 13.2 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికే సునాయాసంగా లక్ష్యాన్ని అధిగమించింది. ఎంపీఈడీ జట్టు కెప్టెన్‌ చిరంజీవి సిరీస్‌లో 198 పరుగులు, 7 వికెట్లు సాధించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ దక్కించుకున్నారు. సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య వి.రంగస్వామి విజేతలకు కప్‌ అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈడీ విభాగం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఎంవీ శ్రీనివాసన్, డాక్టర్‌ కిరణ్‌ చక్రవర్తి, శివ, డాక్టర్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top