మండల పరిధిలోని సి.రాజుపాళెంకు చెందిన నిమ్మకాయల జయవర్ధన్‌రెడ్డి(26) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
కమలాపురం: మండల పరిధిలోని సి.రాజుపాళెంకు చెందిన నిమ్మకాయల జయవర్ధన్‌రెడ్డి(26) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. జయవర్ధన్‌రెడ్డి ఎర్రగుంట్లలోని అపోలో ఫార్మసీలో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన డ్యూటీకి వెళ్లిన జయవర్థన్ ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో బంధువుల, స్నేహితుల ఇళ్ల వద్దకువెళ్లి వెతికారు. అతని ఆచూకీ లభించక పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా జయవర్ధన్‌రెడ్డి రెండు సార్లు ఇలాగే ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చాడు. అయితే ఈ సారి ఎక్కువ రోజులైందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జయవర్థన్‌రెడ్డి అన్న మునిరెడ్డి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.