16న కైట్‌ ఫెస్టివల్‌..


సాక్షి, యాదాద్రి : యాదాద్రి పుణ్యక్షేత్రం టెంపుల్‌ సిటీలో ఈ నెల 16న అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. దేవస్థానం సమీపంలో ఉన్న విశాలమైన పెద్దగుట్టపై నిర్వహించే ఈకార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులతోపాటు టూరిజం శాఖ అధికారులు హాజరుకానున్నారు.  దాదాపు 19దేశాల పతంగులు ఎగురవేయడానికి ప్రత్యేక నైపుణ్యం కలిగిన 32మంది వస్తున్నారు.  ఈ వేడుకను తెలంగాణ పర్యాటక శాఖ, ఆగాఖాన్‌ అకడమీ  సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.ప్రత్యేక ఏర్పాట్లు

ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో జరిగే కైట్‌ ఫెస్టివల్‌ను ఈసారి యాదాద్రి పుణ్యక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నారు.దీనికి గాను నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం నలుమూలల నుం వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. జనగాం, కూకట్‌పల్లి, కుషాయిగూడ, రాయగిరి, సికింద్రాబాద్‌ల నుంచి బస్సులు నడుపుతారు. అలాగే మంచినీరు, టెంట్లు,  భోజన, రవాణా వసతి ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని బుధవారం యాదాద్రిలో ప్రత్యేక పతంగుల ప్రదర్శన నిర్వహించారు.ఉదయం 9గంటల నుంచి..

 కైట్‌ ఫెస్టివల్‌ను 16వ తేదీ ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహిస్తారు.  ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, స్కాట్లాండ్, యూకే, దక్షిణకొరియా, శ్రీలంక, ఇటలీ, ఉక్రెయిన్, వియత్నాం, పోలాండ్, మలేషియా,  కంబోడియా వంటి 19 దేశాల నుంచి 32 మంది పాల్గొంటారు. విదేశీయులతోపాటు భక్తులు, యాత్రికులు    సుమారు 2000 మంది పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తున్నారు.కైట్‌ ఫెస్టివల్‌తో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి క్షేత్రంలో కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించడం ఎంతో గొప్ప విషయం. దీని ద్వారా యాదాద్రి ప్రాముఖ్యత మ రింత విశ్వవ్యాప్తమవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించే ౖMðట్‌ ఫెస్టివల్‌ గ్రామీణప్రాంతానికి రావడం ఎంతో హర్షనీయం. స్థానికులు పెద్ద ఎత్తున ఈపండుగలో పాల్గొనాలి.

– గొంగిడి సునీత, ప్రభుత్వ విప్‌దేశంలోనే మొదటిసారి

యాదాద్రి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యం. అందుకే దేశంలోనే మొదటి సారిగా  కైట్‌ ఫెస్టివల్‌ను యాదాద్రిలో  నిర్వహిస్తున్నాం.  ఫెస్టివల్‌లో పాల్గొనే వారికి  సంస్థ తరఫున భోజనం, మంచి నీరు, బిస్కట్లు,  తిను బండారాలు అందజేస్తాం.  సేద తీరడానికి ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేస్తున్నాం.

Back to Top