విశాఖ మీదుగా జనసాధారణ్‌ రైళ్లు

విశాఖ మీదుగా జనసాధారణ్‌ రైళ్లు - Sakshi


వైజాగ్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సంత్రగచ్చి, చెన్నై వయా ఖరగ్‌పూర్, ఖుర్దారోడ్, విశాఖ, విజయవాడ మీదుగా జనసాధారణ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నట్టు ఈకో రైల్వే వాల్తేరు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎల్వేందర్‌ యాదవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.



సంత్రగచ్చి నుంచి చెన్నై వెళ్లే బై వీక్లీ జనసాధారణ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(02807) ఈనెల 4 నుంచి 29 తేదీల మధ్య (బుధ, శనివారాల్లో) సాయంత్రం 7 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు (గురు, ఆదివారాల్లో) ఉదయం 07.55 గంటలకు విశాఖ చేరుకుని అదేరోజు రాత్రి 11.45 గంటలకు చెన్నై చేరుకుంటుంది.  



తిరుగుప్రయాణంలో 02808 నంబరుతో ఈనెల 6 నుంచి వచ్చే నెల 1 తేదీల మధ్య ఉదయం 08.10 గంటలకు (సోమ, శుక్ర వారాల్లో) చెన్నై నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 08.35 గంటలకు విశాఖ చేరుకుని ఆ మర్నాడు (మంగళ, శనివారాల్లో) ఉదయం 10.25 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. 15 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ కోచ్‌లు, రెండు సెకండ్‌ సిట్టింగ్‌ కం లగేజ్‌ కోచ్‌ల కంపోజిషన్‌ ఉన్న ఈ జత రైళ్లు భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, విజయనగరం, విశాఖపట్నం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top