కలసికట్టుగా పనిచేద్దాం


- అసమ్మతి నాయకులకు ఎమ్మెల్యే బాలకృష్ణ బుజ్జగింపు

హిందూపురం అర్బన్‌ :
పార్టీలో విబేధాలు వద్దు.. ఎవరి పెత్తనం ఉండదు.. అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్దా.. అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులను బుజ్జగించారు. హిందూపురం నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా వర్గవిభేదాలు తారస్థాయికి చేరి గ్రూపులుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే పీఏ శేఖర్‌, చిలమత్తూరు, లేపాక్షి ఎంపీపీలను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు పెట్టారు.ఇదేక్రమంలో కొందరు నాయకులపై వేసిన సస్పెషన్‌ వేటును ఎత్తివేయాలని అమస్మతి నాయకులు మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు కోరారు. ఈమేరకు అసమ్మతి నాయకులతో ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం వరకు సమావేశమయ్యారు. ముందుగా అసమ్మతినాయకులు పీఏ శేఖర్‌ చేసిన అవినీతి, ఆయన వర్గీయులు చేసిన అక్రమాలను బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జరిగిదంతా వదిలేయండి.. ఇకపై అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకుపోదాం.. పార్టీని బలపేతం చేద్దాం.. అని చెప్పారు. ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా పని చేసి ఉంటే తనకు 50 వేల మెజార్టీ వచ్చేదని బాలకృష్ణ తన మనసులో మాట బయటపెట్టారు.పదిరోజుల్లో కొత్త పీఏ

శేఖర్‌పై వచ్చిన ఆరోపణల మేరకు ఆయనను పక్కకు తప్పించి పదిరోజుల్లో కొత్త పీఏ హిందూపురం రానున్నట్టు బాలకృష్ణ చెప్పారు. అనంతరం మాజీ ఎంపీపీ కొండూరు మల్లికార్జునతో పాటు మరో ఐదుగురిపై వేసిన సస్పెషన్‌ ఎత్తివేçస్తున్నట్లు ప్రకటించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top