సస్యరక్షణతో అధిక దిగుబడులు


ఎమ్మిగనూరురూరల్: మిరప, టమాట పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నరసింహుడు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కలుగొట్ల గ్రామంలో ఉద్యానశాఖ ఆ«ధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిరప, టమాట పంటల్లో  దోమలతో ఆకుముడత తెగులు వస్తోందన్నారు. దోమల నివారణకు జిగరు నీలిరంగు అట్టలను ఉపయోగించాలని సూచించారు. ఉద్యానశాఖ అధికారిణి ఇందిర, ఆత్మ బీటీఎం కృష్ణస్వామి, బిందు సేద్యం అధికారి సాంబశివుడు పాల్గొన్నారు.

 
Back to Top