వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం

వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం


అడవిదేవులపల్లి (మిర్యాలగూడ):  నల్లగొండ జిల్లాలో సోమవారం ఓ వికలాంగురాలిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడవిదేవుల పల్లి మండలం చాంప్లాతండా హమ్‌తండాలో ఇటీవల దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు.  ఆదివారం రాత్రి కోలాట ప్రదర్శన జరిగింది. దీనిని చూసేందుకు పక్కనే ఉన్న గోన్యా తండాకు చెందిన వికలాంగురాలు (40) వెళ్లింది. ఈ క్రమంలో ఆమె చెట్ల పొదల మాటుకు బహిర్భూమికి వెళ్లింది.అడవిదేవులపల్లికి చెందిన గొడుగు సతీశ్, గొడుగు హనుమయ్య, బిల్లకంటి మహేశ్‌లు ఆమెను అనుసరించారు. ఆ వికలాంగురాలిని బలవంతంగా చేలోకి తీసుకువెళ్లి సామూహిక లైంగికదాడి జరిపారు. అభాగ్యురాలిని అక్కడే వదిలేసి తిరిగి కోలాట ప్రదర్శన వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేస్తూ కోలాటం వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని రోదిస్తూ బంధువులకు తెలిపింది. అక్కడే ఉన్న గొడుగు సతీశ్‌ను గుర్తించి చూపించడంతో గిరిజనులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Back to Top