ప్రై వేట్‌ డెయిరీలకు పాలు విక్రయించొద్దు

పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న టీఎస్‌డీడీసీ ప్రధాన కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ రవికుమార్‌

కడ్తాల : పాడిరైతులు పాలను ప్రై వేట్‌ డెయిరీలకు విక్రయించి నష్టపోవద్దని టీఎస్‌డీడీసీ ప్రధాన కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ రవికుమార్‌ సూచించారు. శనివారం ఆమనగల్లు మండలం కడ్తాలలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి రికార్డులు, యంత్రాలు, గదులు, ల్యాబ్‌ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాడిరైతు నాణ్యతతో పాలను విజయ డెయిరీకి మాత్రమే విక్రయించాలని కోరారు.

 

పాలసేకరణ కేంద్రంలో మిల్క్‌అనలైజర్‌ ఉపయోగించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఈ కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ డీడీకి సొసైటీ సభ్యులు, డైరెక్టర్లు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకేంద్రం అధ్యక్షుడు కష్ణయ్య, డైరెక్టర్లు రంగయ్య, దశర థ్, చెన్నయ్యగౌడ్, చంద్రకుమార్, నగేశ్, రాజు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top