కేఏ పాల్‌కు కోర్టు సమన్లు


ఒంగోలు: క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్కు ఒంగోలు కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ హత్య కేసులో నిందితుడిని విడిపించేందుకు పోలీస్‌ అధికారులను ప్రలోభపెట్టారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి.కేసును ఎత్తివేసేందుకు పోలీసులు ప్రయత్నించారన్న వాదనలు వినిపించడంతో.. ఈ కేసులో నమోదు చేసిన చార్జిషీటును కోర్టు తోసిపుచ్చింది. కేఏ పాల్‌ హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.

Back to Top