తక్కువ చార్జీలకే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు

తక్కువ చార్జీలకే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు - Sakshi

నెల్లూరు(బృందావనం): జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు అతి తక్కువ చార్జీలకే విస్తృత సేవలను అందించనున్నట్లు జిల్లా టెలికామ్‌ ప్రిన్సిపల్‌ జీఎం రవిబాబు వెల్లడించారు. లీలామహల్‌ సెంటర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ ఫోన్‌ను రూ.49 అద్దెకే అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సౌకర్యం ఆర్నెల్ల పాటు ఉంటుందని వివరించారు. సిమ్‌కార్డు, ఇన్‌స్టలేషన్‌ చార్జీలు ఉచితమన్నారు. ల్యాండ్‌ ఫోన్‌ నుంచి ప్రతి ఆదివారం 24 గంటలు, మిగిలిన రోజుల్లో రాత్రి 9 నుంచి ఉదయం ఏడు గంటల వరకు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా మాట్లాడే సౌకర్యం ఉందని చెప్పారు. 

  •  బ్రాడ్‌బ్యాండ్‌ అన్‌లిమిటెడ్‌ సౌకర్యం ప్రస్తుతం రూ.470కే లభిస్తోందని, ఫోన్‌ సౌకర్యం ఉచితమని, ఎఫ్‌యూపీ 10 జీబీ, 2 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ఉంటుందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే ఎఫ్‌యూపీ పరిమితి దాటిన తర్వాత స్పీడ్‌ను 512 కేబీపీఎస్‌ నుంచి 1 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు తెలిపారు.  

  • బ్రాడ్‌బ్యాండ్‌ వై ఫై మోడెంపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ సౌకర్యం ఉందన్నారు. దీని ద్వారా ప్రతి నెలా ఫోన్‌ బిల్లులో రూ.100 రాయితీని 15 నెలల పాటు పొందగలరని పేర్కొన్నారు. మోడెం విలువ రూ.1500 అని తెలిపారు. 

  • జిల్లాలో కొత్తగా 50 సెల్‌టవర్లకు 3జీ నెట్‌వర్క్‌ను కొద్ది రోజుల్లో ప్రారంభించనున్నామని ప్రకటించారు. జిల్లాలో 43762 ల్యాండ్‌ఫోన్లు, ఐదు లక్షల వరకు మొబైల్‌ కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలపై వివరాలకు 0861 2306544 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెల్లూరు డీజీఎం మురళీకృష్ణ, రూరల్, ఫైనాన్స్‌ డీజీఎంలు సుబ్బారావు, అంకయ్య, ఏజీఎం ప్రసాద్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top