అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు


నిజామాబాద్‌ క్రైం (నిజామాబాద్‌ అర్బన్‌) : బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని బుధవారం మూడో టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి నగర సీఐ సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని హమల్‌వాడికి చెందిన మాదాస్‌ రాజు అనే యువకుడు కొద్దిరోజుల క్రితం దుబ్బా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌కు తీసుకెళ్లాడు.అక్కడ బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం నిజామాబాద్‌కు వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు రాజుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం రాజుపై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

 

Back to Top