తెల్లనివన్నీ పాలు కాదు !

తెల్లనివన్నీ పాలు కాదు ! - Sakshi


– ఇటీవల కాలంలో పెరుగుతున్న కల్తీ పాలు

 - వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి

– పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్‌ టి.శ్రీనాథాచార్‌


అనంతపురం అగ్రికల్చర్‌ : మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన సమీకృతాహారంగా పిలవబడుతున్న పాలలో ఇటీవల కల్తీలు ఎక్కువైనందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ అనంతపురం డివిజన్‌ ఇన్‌చార్జి డీడీ డాక్టర్‌ టి.శ్రీనాథాచార్‌ తెలిపారు. తెల్లనివన్నీ ‘పాలు’ కావనే వాస్తవాన్ని గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పాలు... గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జీవనాధారంగా, మధ్య దళారులకు లాభసాటి వ్యాపారంగా, పట్టణాలలో వినియోగదారులకు నిత్యావసర పోషకంగా మారాయన్నారు. అయితే పాలలో ఉన్న పోషకాలేంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, పాలను కల్తీ ఎలా చేస్తారు, దాని వల్ల నష్టాలేంటి అనే అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.



పాలలో పోషకాలు

పాలల్లో ముఖ్యమైన పదార్ధము వెన్న, ఫ్యాట్, యస్‌.ఎన్‌.ఎఫ్‌. వెన్నకాని ఘన పదార్ధాలు అంటే పిండి పదార్థాలు, లాక్జోస్‌ రూపంలో మాంసపు కృత్తులు, విటమిన్‌లు, ఖనిజ లవణాలుంటాయి. పాలు నిత్యావసరమైన అతి విలువైన పోషకాహారం కావడంతో వాటి విలువను గుర్తించి భారత ప్రభుత్వము ఆహార కల్తీ నిరోధక చట్టం పరిధిలోనికి తెచ్చారు.  



ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రకారం పాలలో ఉండాల్సినవి



పాలు                వెన్న స్ధాయి        యస్‌.ఎన్‌.ఎఫ్‌ స్ధాయి

––––––––––––––––––––––––––––––––––––––



గేదెపాలు          5.0 శాతం            9.0 శాతం

ఆవుపాలు          3.5 శాతం            8.5 శాతం

మిక్స్‌డ్‌ మిల్క్‌    4.5 శాతం            8.5 శాతం

ఫుల్‌ లీప్‌ మిల్క్‌    6.0 శాతం            9.0 శాతం

యస్‌.టీ.డీ.        4.5 శాతం            8.5 శాతం

టోన్డ్‌మిల్క్‌        3.0 శాతం            8.5 శాతం

డబుల్‌ టోన్డ్‌        1.5 శాతం            9.0 శాతం

వెన్న తీసినవి      0.5 శాతం            8.7 శాతం

––––––––––––––––––––––––––––––––––––––––––––––––.  

కల్తీ ఎలా చేస్తారు ?

పక్క పట్టికలో తెలిపిన పోషక పదార్థాలు సహజమైనవి. అతి విలువైనవి. అందుచేత వాటిని బదులుగా అలాంటి వేరొక తక్కువ రకం పదార్ధం కలపడం జరుగుతుంది. తద్వారా అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. వెన్నకు బదులుగా డాల్డా, వెజిటబుల్‌ ఆయిల్‌ కలిపే అవకాశం ఉంది. యస్‌.ఎన్‌.ఎఫ్‌. పెంచేందుకు పంచదార, పిండి సంబంధమైన పదార్ధాలు, యూరియా, ఉప్పు లాంటివి కలుపుతారు. పాల పరిమాణాన్ని పెంచుకొనేందుకు నీరు కలపడం. పాలలో పూర్తిగా వెన్న తీసివేయడం చేస్తారు. తాను పెట్టిన విలువకు తగ్గట్టు పాలు రావు. దీని వల్ల వినియోగదారునికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. పాలలో నాణ్యత లేనందున ఆరోగ్యపరంగా ఆశించిన ఫలితం దక్కదు.  పాలు విరిగి పోకుండా బేకింగ్‌ సోడా, వాషింగ్‌సోడా, కస్టల్‌ సోడా లాంటి క్షార సంబంధమైన రసాయనిక పదార్ధాలు కలుపుతారు. ఈ పరిస్థితుల్లో పాల నాణ్యత విషయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top