జడ్పీ సీఈవో ఇళ్లపై ఏసీబీ దాడులు

జడ్పీ సీఈవో ఇళ్లపై ఏసీబీ దాడులు


నెల్లూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జడ్పీ సీఈవో ఇళ్లపై శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. సీఈవో బొబ్బా రామిరెడ్డికి చెందిన ఇళ్లలో ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమైన ఈ సోదాలు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఐదు ప్రాంతాలతోపాటు తిరుపతిలో నాలుగు చోట్ల, గుంటూరులో నాలుగో ప్రాంతాలు, హైదరాబాద్‌లో ఒకచోట నెల్లూరు రేంజి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.తనిఖీల్లో నెల్లూరు, చిత్తూరు, గుంటూరులో 14 ఇళ్ల స్థలాలు, గుంటూరులో ఒక భవనం, నెల్లూరులో రెండు మల్టీప్లెక్స్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 2.5 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

 

Back to Top