ఏసీబీకి దొరికిన మున్సిపల్‌ కమిషనర్‌


ఏసీబీకి దొరికిన మున్సిపల్‌ కమిషనర్‌

పులివెందుల(వైఎస్సార్‌):
వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మున్సిపల్‌ కమిషనర్‌ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కాంట్రాక్టరు చేసిన పనికి బిల్లులు చేయటానికి గాను ఆయన లంచం డిమాండ్‌ చేశారు. సదరు కాంట్రాక్టర్‌ అందించిన సమాచారంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు.వారి సూచనల మేరకు మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ సూర్యమోహన్‌కు బుధవారం సాయంత్రం రూ.15వేలు లంచం అందజేస్తుండగా వలపన్ని పట్టుకున్నారు.

Back to Top