ఒత్తిడి.. ఉక్కిరిబిక్కిరి!

ZPTC MPTC Elections Extra Burden On Police - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: గ్రామీణ ప్రాంతంలో మరో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికల సమరానికి తెరలేచింది. ఈ ఎన్నికలు పూర్తిస్థాయిలో గ్రామీణ రాజకీయాలతో ముడిపడి ఉన్నందున ప్రతి ఊరు ఓ ఎన్నికల సంగ్రామంగా మారనుంది. గ్రామం లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో శాంతిభద్రతలు కాపాడటం పోలీస్‌ వ్యవస్థకు స వాల్‌గా మారనుంది. కొద్ది నెలల వ్యవధిలో శాసనసభా, సర్పంచ్, ఎంపీ ఎన్నికలు జరిగిపోయా యి. ఆయా ఎన్నికల్లో పోలీసులు తమ స్థాయికి మించి విధులు నిర్వర్తించి.. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు సాఫీగా జరిగేలా సఫలీకృతమయ్యారు. పల్లెపోరులో చివరి ఎన్నికలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.

ఉండాల్సిందెంత.. ఉన్నదెంత
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్ల పరిధి లో దాదాపు 755 మంది సివిల్‌ పోలీసులు ఉండా ల్సి ఉండగా.. 500లలోపు మాత్రమే ఉన్నారు. దీ నికి తోడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిధిలో ఉన్న పాత గ్రామ పంచాయతీలను విభజించి అదనం గా కొత్త గ్రామ పంచాతీయలను ఏర్పాటు చేయడంతో పాత గ్రామ పంచాయతీలు ఉన్న స మయంలోనే ఒక విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌కు రెండు నుంచి మూడు గ్రామాలను కేటాయించారు. దీనికితోడు ప్రస్తుతం పెంచిన గ్రామ పంచాయతీలతో వీరికి మరింత అదనపు భారం పడింది.

కేటాయించేది ఎలా..?
ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా పరిధిలో ఉన్న పోలీస్‌ సిబ్బందితోనే ఎన్నికలలో రూట్‌ మొబైల్స్, స్ట్రైకింగ్‌ ఫోర్స్, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్, ఫ్లయింగ్‌ స్క్వార్డ్, చెక్‌పోస్టులు, ఈవీఎం గార్డులు, అబ్జర్వర్స్‌ భద్రత కోసం సిబ్బందిని కేటా యించాల్సి వస్తుంది. దీనికి తోడు రాజకీయ నేత ల బహిరంగ సభలు, ర్యాలీలు, నాయకుల సెక్యూరిటీకి సిబ్బందిని కేటాయించాల్సి వస్తుంది. ఈ క్ర మంలో ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉపయోగించుకోగా మి గిలిన సిబ్బందికి అదనపు భారం పడుతుంది. జి ల్లాలో మూడు విడతలుగా జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలీస్‌ సిబ్బందిని ఉపయోగించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన మొద టి విడత నుంచి మూడో విడత వరకు జి ల్లాలో ఉ న్న పోలీస్‌ సిబ్బందిని ఎన్నికల విధులకు కేటా యిస్తే పెట్రోలింగ్, దొంగతనాలు, శాంతిభ ద్రత ల పరిరక్షణలో సమస్యలు తలెత్తే అవకాశం లేకపో లేదు. జిల్లాలో ఉన్న సిబ్బందికి వరుసగా ఎన్నిక లు ముగిసే వరకు డ్యూటీలు వేస్తే వారు శారీరకం గా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవా ల్సి వసుందన్న ఆవేదన కూడా వ్యక్తమవుతుంది.

గ్రామ పోలీసులే కీలకం
పూర్తిగా గ్రామీణ స్థాయిలో జరగనున్న ఈ ఎన్నికలు పల్లెపల్లెలో, వీధివీధిలో రాజకీయ చిచ్చు రగులుకోకుండా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో గ్రామ పోలీస్‌ పాత్ర కీలకంగా మారుతుంది. గ్రామాల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను సైతం క్షణాల్లో పోలీస్‌ వ్యవస్థకు సమాచారం చేరవేసి కీలక బాధ్యత కలిగిన గ్రామ పోలీస్‌ వ్యవస్థను ఎంతో కాలంగా అమలు చేస్తున్నారు. నిత్యం తనకు కేటాయించిన గ్రామంలోని ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉంటూ తరచూ గ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ.. అక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. గ్రామంలో ఒక సభ్యుడిగా మెలుగుతూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంటాడు. అయితే కానిస్టేబుల్‌ స్థాయిలో పెరుగుతున్న బాధ్యతలు తగ్గిన సిబ్బందితో ఉన్న వారిపై మోయలేనంతగా పనిభారం పడుతుంది. ఈ క్రమంలో తమకు కేటాయించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడం వారికి తలకు మించిన భారంగా పరిణమిస్తుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top