ప్రేమికుడి వంచనతో యువతి ఆత్మహత్య

Young Woman Commits Suicide With Love Failure in Anantapur - Sakshi

పెళ్లికి నిరాకరించిన యువకుడు

మనస్తాపానికి గురైన యువతి

బతకాలని లేదంటూ చెల్లికి ఫోన్‌

డ్యూటీ నుంచి ఇంటికెళ్లి బలవన్మరణం

అనంతపురం,కణేకల్లు: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కుందుర్పి మండలం అపిలేపల్లికి చెందిన వడ్డే కామాక్షి (30) కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఫీల్డ్‌ కార్యాలయంలో ఉన్న డిసేబుల్‌ సెంటర్‌ (మానసిక వికలాంగుల కేంద్రం)లో టీచర్‌ కమ్‌ ఫిజియోథెరపీ వర్కర్‌గా పని చేస్తోంది. ఈమెకు నారాయణపురంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేష్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అతను కూడా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఈ విషయమై బుధవారం ఉదయం కామాక్షి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తాను చేసుకోనని తెగేసి చెప్పాడు. అతడి మాటలకు కామాక్షి తీవ్ర మనస్తాపం చెందింది. అలాగే డ్యూటీకి వెళ్లింది.

మధ్యాహ్నం 2.20 గంటలకు బ్యాంకుకు వెళ్తున్నానని  సహచర ఉద్యోగులకు చెప్పి నేరుగా తనుండే క్వార్టర్స్‌కు వెళ్లింది. అనంతరం తన చెల్లి శృతికి ఫోన్‌ చేసి తనను ప్రేమించిన రాజేష్‌ పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని, చాలా బాధగా ఉందని, ఇక బతకాలనే ఆశ లేదని, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పెట్టేసింది. వెంటనే శృతి తన అన్నకు ఫోన్‌ ద్వారా సమాచారమందించింది. అతను కామాక్షి సహచరులకు ఫోన్‌ చేసి అప్రమత్తం చేశాడు. వెంటనే సిబ్బంది క్వార్టర్స్‌కు వెళ్లి తలుపులు తట్టినా తీయలేదు. కిటికీలోంచి చూడగా బెడ్‌రూంలో ఫ్యాన్‌కు నైలాన్‌ వైరుతో ఉరివేసుకుని వేలాడుతుండటం కనిపించింది. ఇదంతా పది నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. తన చావుకు దారితీసిన కారణాలపై కామాక్షి లేఖ రాసిపెట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top