ప్రాణం తీసిన భూ వివాదం

Young Man Suicide In Rangareddy - Sakshi

మర్పల్లి : పురుగుల మందు తాగిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కొత్లాపూర్‌ గ్రామం లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. కుటుం బ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. మండల పరిధిలోని కొత్లాపూర్‌ గ్రామానికి చెందిన టోపుగుండ్ల ప్రతాప్‌రెడ్డి దాయాదు రాయిరెడ్డి భూ వివాదం విషయమై గత పది సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తుంది. రాయిరెడ్డి తరుఫున కోర్టులో సాక్షం చెప్పే వారి ఇళ్ల వద్దకు ప్రతాప్‌రెడ్డి కుమారుడు బలవంత్‌రెడ్డి (20) మద్యం తాగి వెళ్లి అసభ్యకరంగా దూషించాడు. విషయం తెలుసుకున్న తండ్రి ప్రతాప్‌రెడ్డి తన కుమారుడిని మందలించారు. రాయిరెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. బలవంత్‌రెడ్డి తమపై తమ దాయాదులు అక్రమ కేసు పెట్టారని, ఓ సారి వారిని పిలిపించి తమ సమక్షంలో మాట్లాడాలని ప్రతాప్‌రెడ్డి మర్పల్లి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

పోలీసులు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తుండడంతో  మనస్తాపం చెందిన బలవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్ర తన పొలం వద్ద పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన గ్రామస్తులు మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బలవంత్‌రెడ్డికి ప్రథమ చికిత్స నిర్వహించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం బలవంత్‌రెడ్డి మృతిచెందాడు. మృతుని తండ్రి ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మర్పల్లి పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీలకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటనారాయణ తెలిపారు.  
బలవంత్‌రెడ్డి (ఫైల్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top