యువతిని కత్తులతో నరికి చంపిన దుండగులు

A Young Girl Was Murdered In Yalamanchili - Sakshi

సాక్షి, యలమంచిలి : ప్రేమ పేరుతో ఉన్మాది పాల్పడ్డ ఘాతుకానికి మరో యువతి బలైంది. తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో విజయవాడకు చెందిన ఓ యువకుడు...పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లి మరీ యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. నక్కింటిచెరువువారికి చెందిన పెనుమాల మహిత(19) ఆదివారం తన బంధువుల గ్రామమైన యలమంచిలి మండలం కాజకు వచ్చింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఆమెపై విజయవాడకు చెందిన కురేళ్ల మహేష్‌ తన స్నేహితులతో కలిసి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. మహితపై దాడి చేసిన మహేష్‌ను స్థానికులు బంధించి పోలీసులు అప్పగించారు. మరో ఇద్దరు యువకులు పరారయ్యారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తాం: డీఎస్పీ

ఈ ఘటనపై స్థానిక డీఎస్పీ కె.నాగేశ్వర రావు స్పందించారు. పెనుమాల మహిత(18) అనే యువతి కాకినాడ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ చదివింది.. ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో రాజోలు ఆదిత్య కాలేజీలో ఇంటర్‌ మళ్లీ చదువుతోందని తెలిపారు.. యువతి స్వగ్రామం భీమవరం మండలం బేతపూడి గ్రామం.. యువతి తండ్రి భీమవరం ఆదిత్య కాలేజీ బస్సు డ్రైవర్‌. తల్లి ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిందని చెప్పారు. దాడికి పాల్పడిన కృష్ణా జిల్లా మైలవరం గ్రామానికి చందిన కూరెళ్ల మహేశ్‌ను గ్రామస్తులు తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడని వెల్లడించారు.

దీంతో అతడిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు.  మహేశ్‌ స్పృహలోకి వస్తే గానీ పూర్తి వివరాలు తెలియవన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో మహేశ్‌ మరో ఇద్దరు యువకులతో కలిసి మహిత మేనమామ ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. పూర్తిగా విచారణ జరిపిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని నాగేశ్వరరావు అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top