ఇష్టం లేని పెళ్లి చేశారని.. 

Young Girl Suicide Due To Early Marriage In Kurnool - Sakshi

రుద్రవరం : ఇష్టం లేని, చిన్నవయస్సులో పెళ్లి చేశారని మండలంలోని తువ్వపల్లె గ్రామానికి చెందిన చంద్రకళ (19) ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. చంద్రకళకు మండలంలోని డి.కొట్టాలలోని మేనమామ కుమారుడు రాజుతో రెండునెలల క్రితం  వివాహం చేశారు. ఆషాడమాసం రావడంతో చంద్రకళ పుట్టింటికి చేరుకుంది. శ్రావణమాసం ఆరంభం కావడంతో భార్యను తీసుకెళ్లేందుకు రాజు తువ్వపల్లెకు వచ్చాడు. మధ్యాహ్నం అత్తారింటికి వెళ్లాల్సి వస్తుందని మనస్తాపానికి గురైన చంద్రకళ అందరూ ఉండగానే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని తండ్రి పంచెతో ఫ్యాన్‌కు ఊరేసుకుంది.

ఎంత సేపటికీ కూతురు తలుపులు తీయకపోవడంతో తల్లిదండ్రులు అనుమానంతో బలవంతంగా తలుపులు తెరిసి చూడగా చంద్రకళ  ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కూతురి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయంపై ఎస్‌ఐ చిన్నపీరయ్య యాదవ్‌ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top