వక్రబుద్ధికి తగిన శాస్తి

Women Molested in Hyderabad - Sakshi

మలక్‌పేట : ఓ యువతి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా తొంగిచూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఓ యువకుడిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి మూసారంబాగ్‌ డివిజన్‌ సెవెన్‌ హిల్స్‌ అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులో నివాసం ఉంటుంది. అదే ఫ్లోర్‌లో  ఓ ఇంట్లో బాలానగర్‌ ఫతేనగర్‌కు చెందిన ఆర్‌. శివకుమార్‌ పిళ్లై(37) అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 26న  యువతి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తోంది. శివకుమార్‌  స్టూల్‌ వేసుకుని బాత్‌రూమ్‌ కిటీకి నుంచి రహస్యంగా లోపలికి తొంగి చూశాడు. యువతి గమనించి అరవడంతో అక్కడ నుంచి పారిపోయాడు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న  సీసీ ఫుటేజ్‌లను పరిశీలించగా శివకుమార్‌ వక్రబుద్ధి బయటపడింది. దీంతో 27వ తేదీన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఎస్‌ఐ శ్రీనునాయక్‌ కేసు నమోదు చేసి శనివారం అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.  

అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు 
అల్వాల్‌: డ్రైవింగ్‌ చేర్చుకోవడానికి వచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అల్వాల్‌  అంబేద్కర్‌నగర్‌లోని డ్రైవింగ్‌ స్కూల్‌ వద్ద నేర్చుకోవడానికి వచ్చిన మహిళ పట్ల శనివారం సంస్థ యజమాని ఏసుబాబు అసభ్యంగా ప్రవర్తించాడని తెలపడంతో స్థానికులు ఏసుబాబును చితకబాది అల్వాల్‌ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

వివాహితతో అసభ్య ప్రవర్తన 
జవహర్‌నగర్‌:  మద్యం మత్తులో యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వివాహితపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దేవేందర్‌నగర్‌లో  జరిగింది. శనివారం ఉదయం దేవేందనగర్‌ కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వివాహితను మద్యం మత్తులో ఉన్న యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో కాలనీవాసులు గుర్తించి యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే యువకుడికి మతిస్ధిమితంలేదని గత మూడు సంత్సరాలుగా వైద్యం చేయించుకుంటున్నాడని ఎస్‌ఐ హయూమ్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top