క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్య

Women  Committed Suicide  - Sakshi

గుర్ల(చీపురుపల్లి) : గుర్ల మండలంలోని పెనుబర్తి గ్రామానికి చెందిన పొదిలాపు వాసు (24) అనే యువకుడు క్షణికావేశంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ సంభాన రవి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. వాసు జేసీబీ హెల్పర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన వచ్చిన ఆయన ఇంటికి వచ్చిన తర్వాత పురుగు మందు తాగేశాడు. దాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తుండగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కోపం ఎక్కువని, ఆయనపై ఎవరైనా దుష్పప్రచారం చేయడం వల్లే అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుడికి తల్లి సీతాలక్ష్మి, చెల్లెలు రోహిణి, తమ్ముడు అశోక్‌ ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

కేంద్రాస్పత్రిలో ఆందోళన

విజయనగరం ఫోర్ట్‌ : కేంద్రాస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం ఓ రోగి మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి చెందారని బంధువులు డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన పొదిలాపు వాసు (24) మంగళవారం ఉదయం  పురుగుమందు తాగడంతో కుటుంబ సభ్యులు చీపురుపల్లి సిహెచ్‌సీకి, అక్కడ నుంచి కేంద్రాస్పత్రికి తీసుకొచ్చారు.

మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో కేంద్రాస్పత్రిలో వాసుని చేర్పించారు. 2:15 గంటలకు రోగి మృతి చెందాడు. అయితే ఆస్పత్రిలో చేర్చిన తర్వాత వైద్యులు సకాలంలో చికిత్స అందించ లేదని, చికిత్స అందించడంలో జాప్యం చేశారని, మీ వల్లే మా బిడ్డ చనిపోయాడని వైద్యులతో మృతుని బంధువులు వాగ్వాదానికి దిగారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top