యువతిపై వృద్ధుడి లైంగిక వేధింపులు | Woman Harassed By Old Man Penamalur | Sakshi
Sakshi News home page

యువతిపై వృద్ధుడి లైంగిక వేధింపులు

Jul 13 2019 10:17 PM | Updated on Jul 13 2019 10:27 PM

Woman Harassed By Old Man Penamalur  - Sakshi

సుబ్రహ్మణ్యం (60) అదే గ్రామానికి చెందిన బత్తిన హారిక (26)ను  లైంగిక కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు.

సాక్షి, విజయవాడ : జిల్లాలోని పెనమలూరు మండలం కానూరులో మరో కీచకపర్వం వెలుగులోకి చూసింది. కూతురు వయసున్న ఓ యువతిపై అరవై ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు దిగాడు. కోరిక తీర్చాలంటూ వెంటబడ్డాడు. వేధింపులు తాళలేక బాధిత యువతి విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై పలు సెక్షన్లకింద కేసునమోదు చేశారు. వివరాలు.. పెనమలూరు మండలం కానూరుకు చెందిన సుబ్రహ్మణ్యం (60) అదే గ్రామానికి చెందిన బత్తిన హారిక (26)ను  లైంగిక కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు. గత కొన్ని రోజులుగా ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో బాదిత యువతి విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై ఐపీసీ 420, 354, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement