విద్యార్థినికి కాంగ్రెస్‌ స్టూడెంట్‌ లీడర్‌ బెదిరింపులు

In Utter Pradesh Congress Student Leader Molested Teen to Better Behave - Sakshi

లక్నో : ‘ఇప్పుడు నువ్వు ఫస్టియర్‌ చదువుతున్నావ్‌.. ఇంకో మూడేళ్లు ఇదే కాలేజీలో చదవాలి.. జర భద్రం’ అంటూ ఓ విద్యార్థినిని బెదిరించే ప్రయత్నం చేశాడు కాంగ్రెస్‌ స్టూడెంట్‌ లీడర్‌. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వివరాలు..  షాజహాన్‌పూర్‌  జిల్లా ఎన్‌ఎస్‌యూఐ(నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా) ప్రెసిడెంట్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్‌.. జూనియర్‌ విద్యార్థినితో తగదా పడ్డాడు.

ఈ క్రమంలో సదరు బాలికతో.. ‘అందంగా ఉన్నావ్‌.. కాస్తా హద్దుల్లో ఉంటే మంచిది. నువ్వు ఇప్పుడు ఫస్టియర్‌. మరో మూడేళ్లు ఇదే కాలేజీలో చదవాలి. నేను తల్చుకుంటే నిన్ను కాలేజీలో అడుగుపెట్టకుండా చేయగలను. బీ కేర్‌ ఫుల్‌’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఇంత జరుగుతుంటే అధ్యాపకులేవ్వరు ఈ గొడవను ఆపే ప్రయత్నం కానీ.. ఇర్ఫాన్‌ను హెచ్చరించడం కానీ చేయలేదు. మిగతా స్టూడెంట్స్‌ వీడియోలు తీయడంలో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో కాంగ్రెస్‌ స్టూడెంట్‌ బాడీ హుస్సేన్‌ను సస్పెండ్‌​ చేయడమే కాక ఆర్గనైజేషన్‌ నిర్వహించే ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top