కొట్టి..చేతులు కట్టేసి..

Unknown Persons Beaten ANd Throw on Road In Hyderabad - Sakshi

యువకుడిని రోడ్డు పక్కన పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది

సుభాష్‌నగర్‌: గుర్తు తెలియని యువకుడిని తీవ్రంగా గాయపరిచి చేతులు కట్టేసి రోడ్డు పక్కన పడేసిన ఘటన సూరారం మొదటి ఓం జెండా చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  25 ఏళ్ల వ్యక్తి చేతులు కట్టేసి ఓం జెండా వద్ద ఓ మెడికల్‌ దుకాణం ఎదుట పడేశారు. అతడికి ఫిట్స్‌ రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం అతను సూరారం చౌరస్తాలో తిరుగుతూ కనిపించాడని టీ స్టాల్‌ యజమాని తెలిపాడు. సూరారం 60 గజాలు అంబేడ్కర్‌ విగ్రహం ప్రాంతంలో ఉంటున్న అతని భార్యకు ఫోన్‌ చేస్తే పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడు స్పృహలోకి వస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top