లైంగిక వేధింపులతో కోడలు ఆత్మహత్య

Uncle Molestation on Son Wife in Tamil nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కుమారుడి భార్యపై మామ లైంగిక వేధింపులకు పాల్పడగా, ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన అరక్కోణంలో జరిగింది. అరక్కోణం సమీపంలోని తిరుత్తణిలో ఉన్న వెంకటాపురానికి చెందిన లారీ డ్రైవర్‌ మునికృష్ణన్‌. ఇతని భార్య యువరాణి. లారీ డ్రైవర్‌ వృత్తికారణంగా రాత్రివేళల్లో విధులకు వెళ్లేవాడు.

కోడలికి తోడుగా ఇంట్లో ఉన్న మామ ఢిల్లీబాబు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయాన్ని అనేక సార్లు భర్తకు చెప్పినా వినిపించుకోలేదు. పైగా తండ్రిపై చాడీలు చెబుతున్నావని తిట్టేవాడని తెలిసింది. మామ లైంగిక వేధింపులు, భర్త తనను నమ్మకపోవడంతో విరక్తితో యువరాణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విధులను ముగించుకుని ఇంటికి వచ్చి న మునికృష్ణన్‌ భార్య శవాన్ని చూసి తీవ్రంగా విలపించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి యువరాణి ఆత్మహత్యకు కారణమైన ఢిల్లీబాబును గురువారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top