మీ ఇద్దరూ ముద్దు పెట్టుకోండి.. ఆనందిస్తాం!

Two Women Beaten Up For Not Giving Kiss In London - Sakshi

లండన్‌ : ముద్దు పెట్టుకోవటానికి తిరష్కరించారన్న కోపంతో కొంతమంది యువకులు ఇద్దరు అమ్మాయిల్ని తీవ్రంగా గాయపర్చారు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, యువతుల్ని ఆసుపత్రి పాలు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి లండన్‌కు చెందిన మెలానీయా గేమౌంట్‌ అనే యువతి తన స్నేహితురాలు క్రిష్‌తో కలిసి ఓ బస్సులో ప్రయాణిస్తోంది. కొద్దిసేపటి తర్వాత కొంతమంది యువకులు ఆ బస్సులోకి ప్రవేశించారు. బస్సులో ఓ పక్కగా  కూర్చుని ఉన్న మెలానీయా, క్రిష్‌ల దగ్గరకు చేరుకున్నారు. అశ్లీల భంగిమలతో యువతులను ఇబ్బంది పెడుతూ.. ‘‘ మీ ఇద్దరూ ముద్దు పెట్టుకోండి.. మేం చూసి ఆనందిస్తాం’’ అంటూ సదరు యువకులు వారిని వేధించారు.

అయితే ముద్దు పెట్టుకోవటానికి మెలానీయా, క్రిష్‌లు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన యువకులు యువతులిద్దరిపై దాడికి దిగారు. మూతిపై పిడిగుద్దులు కురిపించి, వారి బ్యాగులతో సహా అక్కడినుంచి పరారయ్యారు. గాయాలపాలైన యువతుల్ని గమనించిన తోటి ప్రయాణికులు ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top