ఖరీదైన బైక్‌తో పరారీ

Two Men Thefts Honda Gold Wing Bike - Sakshi

బొమ్మనహళ్లి : మీ బైక్‌ చాలా బాగుంది, ఒక ఫొటో తీసుకుంటా మంటూ ఇద్దరు యువకులు బైక్‌ యజమానితో మాట్లాడినట్లు నటిస్తూ ఆపై దాడి చేసి రూ. 27 లక్షల విలువైన బైక్‌తో ఉడాయించిన ఘటన కోరమంగళలో చోటుచేసుకుంది. కోరమంగళకు చెందిన బైక్‌ యజమాని గణేశ్‌ గౌడకు రూ. 27 లక్షల విలువైన హోండా గోల్డ్‌ వింగ్‌ బైక్‌ ఉంది. గురువారం గణేశ్‌ బైక్‌పై పనిమీద బయటకు వచ్చాడు.

ఇంతలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌లో వచ్చి మీ బైక్‌ చాలా బాగుంది, ఒక ఫోటో తీసుకుంటామంటూ నటిస్తూ ఒక్కసారిగా గణేశ్‌పై దాడి చేసి బైక్‌ను తీసుకుని పరారయ్యారు. ఈ హఠాత్‌ పరిణామానికి గురైన గణేశ్‌ హుటాహుటిన కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top