క్వారంటైన్‌ కేంద్రంలో యువతిపై లైంగిక వేధింపులు

Two Held For Shooting Obscene Video Of Quarantined Woman - Sakshi

క్వారంటైన్‌ కేంద్రంలో దురాగతం

భోపాల్‌ : క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న యువతి (22)ని అభ్యంతరకరంగా వీడియో తీసిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని యువతిని బెదిరించిన నిందితులను బుధవారం సాయంత్రం అరెస్ట్‌ చేశామని పోలీసులు వెల్లడించారు. దమో జిల్లాకు చెందిన యువతి ఇండోర్‌ నుంచి తిరిగివస్తూ సాగర్‌ జిల్లాలోని కుమార్‌ భటోలి గ్రామంలోని ఓ పాఠశాలలో క్వారంటైన్‌లో ఉన్నారని జిల్లా పోలీస్‌ అధికారి రాజేష్‌ బంజారా తెలిపారు.

కాగా బాధిత యువతి క్వారంటైన్‌ కేంద్రం వెలుపల బాత్‌రూంలో స్నానం చేస్తుండగా నిందితులు వీడియో తీసి, ఆ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేపట్టామని ఆయన తెలిపారు.

చదవండి: లంకె బిందెల పేరుతో లైంగిక దాడి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top