గుప్త నిధుల వేటలో టీఆర్‌ఎస్‌ నాయకుడు

TRS Leader Arrest in Hidden Funds Hunting case Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ అటవీ రేంజ్‌ పరిధిలో గుప్త నిధుల తవ్వకాల్లో బంజారాహిల్స్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు పి.తిరుమలేష్‌ నాయుడిని పోలీసులు నిందితుడిగా నిర్ధారించారు. ఆయనకు సహాయంగా వడ్డెర పని చేసే ఎల్లప్ప, బాలస్వామి, శ్రీనులతో పాటు డ్రైవర్‌ షహబాజ్‌ అలీ ఉన్నట్లు తేల్చారు. ఆలయంలో భ్రమరాంబికాదేవి విగ్రహాన్ని పూర్తిగా పెకిలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్కార్పియో వాహనంలో తిరిగి వెళ్తున్న క్రమంలో ఫారెస్ట్‌ అధికారులకు చెంచు, గిరిజనులు సమాచారం ఇవ్వడంతో వీరిని వలపన్ని పట్టకున్నారు.

వీరిని విచారించగా ఈ నెల 8వ తేదీన అడవిలోకి ప్రవేశించి రెక్కీ నిర్వహించి తిరిగి సోమవారం సాయంత్రం అడవిలోకి వెళ్లి రాత్రికి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసినట్లు విచారణలో తెలిపారు. తిరుమలేష్‌నాయుడు గతంలోనే పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ మారుస్తానని చెప్పి ఓ ఇన్‌స్పెక్టర్‌తో చేతులు కలిపి బెదిరింపు ఘటనలో రిమాండ్‌కు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. కొద్ది రోజులకే నార్సింగ్‌లో ఓ ల్యాండ్‌ సెటిల్మెంట్‌లో రివాల్వర్‌తో బెదిరించిన ఘటనలోనూ జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ రెండు కేసుల్లో ఓ వైపు విచారణ జరుగుతుండగానే తాజాగా గుప్త నిధుల కోసం వెళ్లి మరోసారి పోలీసులకు చిక్కాడు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న తిరుమలేష్‌ నాయుడు 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరాడు. తిరుమలేష్‌ నాయుడు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top