ప్రియురాలి కోసం వెళ్లి.. టీనేజర్‌ దారుణ హత్య

Tripura Teenager Allegedly Beaten To Death By Girl Relatives - Sakshi

అగర్తలా : ఈశాన్య భారత రాష్ట్రం త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన యువకుడిని గ్రామస్తులు తీవ్రంగా కొట్టిచంపేశారు. వివరాలు.. రిపన్‌ సర్కార్‌(17) అనే విద్యార్థి గోమతి జిల్లాలో నివసిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు బంగ్లాదేశ్‌లో పనిచేస్తుండటంతో.. త్రిపురలో బాబాయి వద్ద ఉండి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో అతడు ప్రేమలో పడ్డాడు. దీంతో గురువారం ఆమెను కలిసేందుకు వాళ్లింటికి వెళ్లాడు.

ఈ విషయం గమనించిన అమ్మాయి కుటుంబ సభ్యులు రిపన్‌ను బయటకు ఈడ్చి అతడిపై దాడి చేశారు. గ్రామస్తులు కూడా వీరితో కలిసి రిపన్‌ను చావబాదారు. ఈ క్రమంలో రిపన్‌ బాబాయి ప్రఫుల్లా అక్కడికి చేరుకోగా.. అతడిపై కూడా దాడి చేశారు. దీంతో అతడు పోలీసులకు ఫోన్‌ చేయగా.. వాళ్లు రిపన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే రిపన్‌ మృతి చెందడంతో అతడి బాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top