అధికారుల వేధింపులే బలిగొన్నాయా ?

Tribal Man Commits Suicide In Chittoor - Sakshi

గిరిజనుడి ఆత్మహత్యపై పెల్లుబికిన నిరసన

మృతదేహంతో  యానాదుల ఆందోళన

వెదురుకుప్పం/కార్వేటినగరం : దుప్పి మాంసం ఉందన్న అనుమానంతో కార్యాలయానికి తీసుకెళ్లి వేధించడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వెదురుకుప్పం మండలం మాం బేడు పంచాయతీ పురుషోత్తమపురం యానాది కాలనీకి చెందిన వెంకటయ్య(65) భార్య ఆదిలక్ష్మి, కుమా రుడు అంజేరి ఆరోపించారు. వారు గురువారం యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, గ్రామస్తులతో కలిసి కార్వేటినగరంలోని అట వీశాఖ కార్యాలయం వద్ద వెంకటయ్య మృత దేహంతో ధర్నాకు దిగారు. ఆమె మాట్లాడుతూ వెంకటయ్య సమీపంలోని మామిడి తోటలో కాపలా ఉంటున్నాడని వాపో యింది. వారం క్రితం దుప్పి మాంసం ఉందన్న సమాచారంతో కార్వేటినగరం అటవీ శాఖ అధికా రులు అదుపులోకి తీసుకుని చితకబాదారని తెలిపింది.

మళ్లీ కేసులు పెడతామంటూ బెదిరించడంతో తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీరుమున్నీరైంది. జిల్లా యానాది సంక్షేమ సం ఘం అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న యానాదులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చిత్రహింసలు పెట్టడం వల్లే వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు. వెంకటయ్య మృతికి కారుకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న  స్థానిక సీఐ చల్లనిదొర, ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించారు. విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
వెంకటయ్య మృతితో సంబంధం లేదుఅటవీశాఖ అధికారి శివన్న వివరణ ఇస్తూ ఈ నెల 12వ తేదీ దుప్పి మాంసాన్ని పంచుతున్నట్లు అందిన రహస్య సమాచారంతో సిబ్బంది అక్కడికి చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మరో ముగ్గురు పరారయ్యారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం నిందితులకు జరిమానా విధించామని, దాడి చేయలేదన్నారు. వెంకటయ్య మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
అమాయకులైన ఎస్టీలపై దాడులు చేసి వ్యక్తి మృతి కి కారకులైన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీడీనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ వెదురుకుప్పం మండలంలో వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, అతని మృతికి అధికారుల వేధింపులే కారణమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిం చాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాల న్నారు.
వెంకటయ్య ఆత్మహత్యకు అటవీ అధికారులే కార ణం అని జిల్లా వ్యవసాయ రైతు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజ ఆరో పించారు. బాధిత కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top