ఇంజనీరింగ్‌ విద్యార్థుల విహారయాత్రలో విషాదం

Tragedy In The Guru Nanak Engineering Students Excursion - Sakshi

ముగ్గురిని బలిగొన్న అతివేగం

ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు

అక్కడికక్కడే ఇద్దరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి

మరో నలుగురికి  తీవ్ర గాయాలు

మృతులు  హైదరాబాద్‌లోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు

సాక్షి, మునగాల(కోదాడ): విహారయాత్ర విషాదాంతమైంది. అతివేగానికి ముగ్గురు విద్యార్థులు బలయ్యారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో గల గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న 16 మంది విద్యార్థులు ఆదివారం గుంటూరు జిల్లా బాపట్లకు రెండు కార్లలో వెళ్లారు. రోజంతా అక్కడ ఎంతో సంతోషంగా గడిపారు. తిరుగు పయనంలో మార్గమధ్యలో విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని వస్తున్నారు. మునగాల మండలం ఇంది రానగర్‌ శివారు వద్దకు రాగానే వీరి ఓ కారు ముందున్న లారీని ఢీకొట్టి ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బాలాపూర్‌కు చెందిన హర్ష (24), చంపాపేట్‌కు చెందిన రేవంత్‌(24), సికింద్రాబాద్‌కు చెందిన శశాంక్‌(26) మృతిచెందారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top