ఇంట్లో నుంచి పారిపోయినందుకు శిక్షగా..

Teen Girl Thrashed Paraded By Family In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు...అలిరాజ్‌పూర్‌ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన పందొమ్మిదేళ్ల అమ్మాయి కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. వేరే తెగకు చెందిన వ్యక్తితో కలిసి వెళ్లిందనే విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు యువతిని వెదికి పట్టుకున్నారు. స్వగ్రామానికి తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారు. అనంతరం అర్ధ నగ్నంగా మార్చి ఇంట్లోని మగ వాళ్లంతా బెత్తంతో ఆమెను కొడుతూ గ్రామంలోని రోడ్ల వెంట తిప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌ కావడంతో ఈ దురాగతం పోలీసుల దృష్టికి వచ్చింది.

ఈ విషయంపై స్పందించిన అలీరాజ్‌ పూర్‌ ఎస్పీ మాట్లాడుతూ... వాట్సాప్‌ ద్వారా వచ్చిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఈ ఘటనపై ఇంతవరకు తమకు ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. బాధిత యువతి లేదా ఆమె తండ్రి వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాతే చర్యలు తీసుకునే వీలుందని వెల్లడించారు. కాగా తమాచి గ్రామంలో గతంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు తెగలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడిన విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు వారిద్దరిని పట్టుకొచ్చి ఊరి మధ్యలో స్తంభాలకు కట్టేసి తీవ్రంగా కొట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top