ఎంపీ విజయసాయిరెడ్డికి బెదిరింపుకాల్స్‌.. కేసు నమోదు

Tadepalli Police Filed Case Against Assailant Over Threatening Calls To YSRCP MP Vijayasai Reddy - Sakshi

సాక్షి, గుంటూరు : తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ రావడంతో వైఎస్సార్‌ సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీచేస్తూ కొద్ది రోజులుగా ఆగంతకులు తనకు పదే పదే కాల్స్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. మొదట వాటిని అంతగా పట్టించుకోనప్పటికీ తాను మీటింగుల్లో ఉన్న ప్రతీసారి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారని ఆయన తెలిపారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను పలువురు అధికార పార్టీ నేతలు తనను చంపుతామంటూ హెచ్చరించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపారు.

వీటి ఆధారంగా కేసు నమోదు చేయాలని పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. తనకు తరచుగా 9618729089, 9538362525, 8247662578, 8886059309 బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని వీటిపై దర్యాప్తు జరపాలని కోరారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ఫిర్యాదు స్వీకరించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top