అనంతపురంలో క్షుద్రపూజల కలకలం!

Suspicious Dead Bodies Found In Anantapur Korthikota - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనకల్లు మండలం కోర్తికోటలో శివాలయం పరిసరాల్లో అనుమాన స్పద రీతిలో మూడు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది.  ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గుప్త నిధుల కోసం శివాలయంలో క్షుద్రపూజలు చేసి ఆ ముగ్గురిని నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను శివరామిరెడ్డి(75), కమలమ్మ(70), సత్యలక్ష్మి(70)గా గుర్తిచారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top