సూసైడ్‌ ఆలోచన వద్దు

Suicide Is A Crime - Sakshi

ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్య పరిష్కారం

క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న యువత

18న ఒకేరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురి బలవన్మరణం

ఆత్మహత్యకు పాల్పడడం నేరమే

ప్రతి జీవి తన ప్రాణాలు కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడుతుంది. మరి మనిషి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. పోరాడితే పోయేదిముంది బానిస సంకెళ్లు తప్ప. ఒక్కక్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే జీవితాంతం హ్యాపీగా బతకొచ్చు.

భువనగిరి క్రైం : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ నెల 18న ఒకేరోజు ఐదుగురు యువకులు, ఓ యువతి ఆయువు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. కారణాలు ఏవైనా కాని కన్నవారికి కడుపుకోత మిగిలింది. నెలరోజుల వ్యవధిలోనే యా దాద్రిభువనగిరి జిల్లా  భువనగిరి మండలంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమపేరుతో వేధింపులకు యువతి, వ్యక్తిగత కారణాలతో యువకుడు, సెల్‌ఫోన్‌ అడిగితే ఇవ్వలేదని మనస్తాపంతో మరో యువకుడు, పాఠశాలకు వెళ్లలేదని తండ్రి మందలించాడని ఓ బాలుడు, ప్రేమపేరుతో మోసపోయానని యువతి.. ఇలా పలు రకాల కారణాలతో  నెల రోజుల వ్యవధిలోనే ఐదుగురు తమ తనువును  చాలించారు. 

ఆత్మహత్య ఆలోచన వస్తే..

ఒక్కసారి మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి. ఎన్నో ఏళ్లుగా తల్లిదండ్రులు, స్నేహితులతో గడిపిన క్షణాలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనసు కొంత కుదుట పడుతుంది. ఇష్టపడి కొనుకున్న సెల్‌ఫోన్‌ కిందపడి పగిలిపోతనే మనం బాధ పడతాం. అలాంటిది మనం దూరమైతే మన కన్నవా రు ఎలా బాధపడతారో ఆ ఒక్క క్షణం ఆలోచించాలి. జీవితంలో ఆనందించిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకోవాలి. మనం ఏదైన మంచిపని చేసినప్పుడు, ఏదైన సందర్భాల్లో విజయం సాధించినప్పుడు మనల్ని అభినందించిన సందర్భాలు గుర్తు చేసుకోవాలి. 

పరిష్కారం కాని సమస్య లేదు

సమస్యలన్నింటికీ మరణమే పరిష్కారం కాదు. అదే పరిష్కారం అనుకుంటే భూమి మీద మనిషి అనేవాడు లేకుండా ఎప్పుడో అంతం అయ్యేవా డు. కష్టాన్ని తప్పించుకోవడానికి ఆత్మహత్య అనే మార్గాన్ని ఎంచుకోవడం కన్నా.. బతికి చూపించి నలుగురి చేత శభాష్‌ అనిపించుకోవడంలోనే విజ యం దాగుంది. చావు బతుకుల మధ్య ఉన్న జీవి తాన్ని పూర్తిగా అనుభవించకుండానే తనువు చాలించాలనుకోవడం క్షమించరాని నేరమే అవుతుంది. అయినా ప్రాణాన్ని పోయలేని మనకు దా నిని తీసే హక్కు లేదు. పోరాడడం తెలిసినవారికి గెలుపు తప్పకుండా అందుతుంది. సమస్యను చూసి పారిపోయేవాడిని మరణం వరకు భయం తరుముతూనే ఉంటుంది. 

తల్లిదండ్రుల పాత్ర..

తోటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నా యి. తోటి విద్యార్థి పెద్ద పని చేస్తున్నాడు. ఎదురింటి వాళ్లు చాలా బాగా బతుకుతున్నారు. నీకేం అయింది అంటూ ఇతరులతో పోల్చుతూ ఎప్పు డు పిల్లల్ని అవమాన పర్చకూడదు. పిల్లలు మనస్తాపంతో కనిపిస్తే తల్లిదండ్రులే కల్పించుకుని వారికి ధైర్యం చెప్పాలి. మానసికంగా కుంగిపోతున్న వారికి ఓదార్పును అందించాలి. వారితో స్నేహంగా మెలగాలి.

ఉపాధ్యాయుల పాత్ర..

పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులను అందరి ముందు చులకన చేసి మాట్లాడితే విద్యార్థులు మానసిక అవమానానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఏం పర్వాలేదు.. మళ్లీ ప్రయత్నించు అని ధైర్యం చెబుతూ సందేహాలను నివృత్తి చేయాలి. మళ్లీ రాణించేందుకు ఏం చేయాలో వారికి వివరించి చెప్పాలి. కష్టాల నుంచి విజయం సాధించిన వారి విజయగా«థలను వివరించి వారిలో ఆత్మస్థైర్యం నింపాలి. ప్రేమతో దేనిని అయినా సాధించవచ్చు.

మిత్రులు ధైర్యం చెప్పాలి

తల్లిదండ్రుల కన్నా, ఉపాధ్యాయుల కన్నా, మిత్రులతోనే చాలామంది సన్నిహితంగా ఉంటారు. తోటి మిత్రుడు ఏదైన సమస్యతో బాధపడుతున్నప్పుడు వారిని దగ్గరికి తీసుకుని ఓదార్చాలి. వారి సమస్యకు పరిష్కారం చాలా సులువు అని చేప్పే ప్రయత్నం చేయాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు మిత్రుల ఓదార్పుతో నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఆత్మహత్య నేరం

చిన్నచిన్న కారణాలకే కుంగిపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నిర్ణ యం తీసుకునేందుకు బదులు ధైర్యంతో బతకాలన్న ఆలోచన చేసినా సమస్య నుంచి గట్టెక్కవచ్చు. సమస్యలకు బయబడి ఆత్మహత్య చేసుకుంటే కన్నవారి, కట్టుకున్నవారికి కడుపుకోత మిగిల్చడమే అవుతుంది. మాములు మనిషి నుంచి మొదలు ఉన్నత స్థాయి మనిషి వరకు పలు రకాల కష్టాలు వస్తునే ఉంటాయి. వీటన్నింటికీ చావు మార్గం కాదు. భారత రాజ్యంగం ప్రకారం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో ఆత్మహత్యకు పాల్పడడం నేరం. 

– వెంకన్న, సీఐ, భువనగిరి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top