భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడంతో అత్తను చంపిన అల్లుడు

son-in-law kills his aunty in kukkanoor - Sakshi

సాక్షి, కుక్కునూరు : భార్య మరో వ్యక్తితో వెళ్లిపోడానికి కారణం అత్తేనని ఆరోపిస్తూ అత్తతో గొడవపడిన అల్లుడు కల్లుగీత కత్తితో  ఆమె గొంతుకోసి హతమార్చిన ఘటన ఆదివారం కుక్కునూరు మండలంలోని లచ్చిగూడెం గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఊటబోరు గ్రామానికి చెందిన కంటిపల్లి రాజుకు, లచ్చిగూడెం గ్రామానికి చెందిన మడివి నాగమ్మ, ముకయ్య దంపతుల కుమార్తె లక్ష్మీకాంతంతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహం అనంతరం లచ్చిగూడెం అత్తగారింటికి ఇల్లరికం వచ్చిన కంటిపల్లి రాజు లచ్చిగూడెంలోనే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రాజు  భార్యతో గొడవపడి చిత్రహింసలకు గురిచేస్తుండడంతో భార్య లక్ష్మీకాంతం రాజును వదిలి ఇరవైరోజుల క్రితం మరోవ్యక్తితో వెళ్లిపోయింది. 

ఈ విషయమై గత మూడు రోజుల క్రితం రాజు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. పంచాయతీ పెద్దలు  లక్ష్మీకాంతం ఆచూకీ తెలిసిన తరువాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని తేల్చారు. కాగా ఆదివారం వేలేరుపాడు మండలం పూచిరాల గ్రామంలో జరిగిన వివాహానికి హాజరైన రాజు ఫుల్లుగా మద్యం సేవించి అత్త నాగమ్మ ఇంటికి వచ్చి  భార్య వెళ్లిపోవడానికి కారణం నువ్వేనంటూ అత్తతో    గొడవపడి కల్లుగీత కత్తితో ఆమె గొంతుకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయమై మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top