రాధాపూర్ణిమది హత్యే

Son Killed Mother For Assets in Hyderabad - Sakshi

డబ్బు కోసం కన్న కొడుకే కడతేర్చాడు..

పోస్టుమార్టం నివేదికలో వెల్లడి..

నిందితుడి రిమాండ్‌

కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ అయోధ్యనగర్‌లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన వృద్ధురాలు రాధాపూర్ణిమది హత్యేనని పోలీసులు తేల్చారు. తల్లి రిటైర్‌మెంట్, పెన్షన్‌ డబ్బు కోసం కన్నకొడుకే హతమార్చాడని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదికలో తలకు, కడుపులో బలమైన గాయాలు తేలినట్లు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న రాధాపూర్ణిమ కుమారుడు వీరేశ్‌ను పోలీసులు విచారించగా డబ్బు కోసం ఘర్షణ జరిగిందని ఈ క్రమంలో తల్లిపై దాడి చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో వీరేశ్‌పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top