ఆస్తి కోసం అమానుషం

Son Attacked With Petrol By His Father's Brother At vinukonda - Sakshi

తమ్ముడి కొడుకుపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన అన్న

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు

ఈపూరు (వినుకొండ): ఆస్తి తగాదా విషయంలో సొంత తమ్ముడి కొడుకుపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని కూచినపల్లి గ్రామంలో గురువారం అర్థరాత్రి జరిగింది. నాశిన పెదకొండయ్య, చినకొండయ్యలు అన్నదమ్ములు. వీరి తల్లి పేరిట 80 సెంట్ల పొలం ఉంది. అన్న పెదకొండయ్య ఆ 80 సెంట్లు పంచాలని కోరుతుండగా, తమ్ముడు వద్దని చెబుతున్నాడు. దీనిపై గురువారం ఇరువురి మధ్య  ఘర్షణ జరగ్గా, తమ్ముడి కొడుకు రాకేష్‌ (16) అడ్డుపడ్డాడు.

ఇది మనసులో పెట్టుకొని అర్ధరాత్రి సమయంలో పెదకొండయ్య పక్కనే ఉన్న తమ్ముడి ఇంటి వద్దకు వెళ్లి నిద్రపోతున్న రాకేష్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బాలుడి నాయనమ్మ కేకలు వేయడంతో పెదకొండయ్య పరారయ్యాడు. కుటుంబీకులు రాకేష్‌ని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలుడి శరీరం సగ భాగం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top