షాపింగ్‌మాల్‌లో సెక్స్‌ రాకెట్‌

Sex Racket Gurugram Busted In a Secret Operation - Sakshi

సీక్రెట్‌ ఆపరేషన్‌లో గుట్టురట్టు

న్యూఢిల్లీ: ఆధునికతకు, అర్బనైనేషన్‌కు సాక్షీభూతంగా.. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయమున్న నగరాల్లో ఒకటిగా నిలుస్తోన్న గురుగ్రామ్‌ సిటీలో సెక్స్‌ దందా విశృంఖలంగా పెరిగిపోతున్నది. గడిచిన కొద్ది రోజులుగా అక్కడి బ్యూటీ స్పాల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే పదుల సంఖ్యలో బ్యూటీ పార్లర్లను సీజ్‌చేసిన పోలీసులు.. తాజాగా షాపింగ్‌ మాల్‌లో సాగుతోన్న సెక్స్‌ రాకెట్‌ గుట్టును రట్టుచేశారు. సీక్రెట్‌ ఆపరేషన్‌ ద్వారా నిందితులను పట్టుకున్నవైనాన్ని గురుగ్రామ్‌ పోలీస్‌ శాఖ పీఆర్‌వో రవీంద్‌ కుమార్‌ మీడియాకు వివరించారు.

గురుగ్రామ్‌ సెక్టార్‌ 50లో గల డీఎల్‌ఎఫ్‌ ఓమెక్స్‌ మాల్‌లో ఒయిస్టర్‌ పేరుతో ఓ బ్యూటీ స్పా సెంటర్‌ ఉంది. అక్కడ వ్యభిచారం సాగుతున్నదంటూ సమాచారం అందడంతో పోలీసులు సీక్రెట్‌ ఆపరేషన్‌కు పథకం రచించారు. విటుడి వేషంలో ఓ అధికారి అక్కడికివెళ్లి నిర్వాహకులతో బేరం కుదుర్చుకున్నాడు. గదిలోపలికి వెళ్లిన తర్వాత టీమ్‌ను అలర్ట్‌చేశాడు. బిలబిలమంటూ అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టిన పోలీసులను చూసి స్పా నిర్వాహకులు ఖంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో ఆరుగురు మహిళలున్నారని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, స్పా అసలు యజమాని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top